Ap News: పవన్ కల్యాణ్ కనిపించడంలేదట... యాంకర్ శ్యామల సెటైర్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-20 10:35:32  IST  )

పవన్ కల్యాణ్, బాలకృష్ణపై వైసీపీ మహిళా నాయకులు శ్యామల విమర్శలు చేశారు..

Ap News: పవన్ కల్యాణ్ కనిపించడంలేదట... యాంకర్ శ్యామల సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan), హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Hindupuram Mla Balakrishna)పై వైసీపీ మహిళా నాయకులు, యాంకర్ శ్యామల(Ycp Women Leader Syamala) తీవ్ర విమర్శలు కురిపించారు. హిందూపురంలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ.. ఈ నియోజకవర్గంలో ఏదో ఒక్కసారి తప్ప సమస్యలు పట్టవని శ్యామల విమర్శించారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోర్డు కనిపిస్తుందని తప్ప.. ఇప్పటి వరకూ తరగతులు జరగడం లేదనే విషయం బాలకృష్ణకు తెలుసా అని శ్యామల నిలదీశారు. బాలయ్య ఈవీఎం వల్లే ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ కనిపించుట లేదని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఆయనకు కనిపించవని, రాష్ట్ర ప్రజలకు ఆయన కనిపించరని ఎద్దేవా చేశారు. వాళ్ల ప్రభుత్వం చేసే పనులు చాలా గొప్పగా చెప్పుకుంటూ నివేదిక ఇచ్చారే తప్ప.. రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటి వరకూ ఒక్కటి కూడా లేదని శ్యామల విమర్శించారు.

ఈ వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి...

Next Story