హైదరాబాద్ - తిరుపతి విమాన ఛార్జీలు తగ్గించండి.. YCP లేఖ !

by velandi.Saikiran |

విమాన ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి లేఖ రాశారు.

హైదరాబాద్ - తిరుపతి విమాన ఛార్జీలు తగ్గించండి.. YCP లేఖ !
X

దిశ‌, వెబ్ డెస్క్: విమాన ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి లేఖ రాశారు. హైదరాబాద్-తిరుపతి మధ్య విమాన ఛార్జీలను తగ్గించాలని ఈ సందర్భంగా కోరారు. మిగతా రూట్స్ తో పోలిస్తే, హైదరాబాద్-తిరుపతి మార్గంలో విమాన ఛార్జీలను అధికంగా వసూలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని లేఖలో స్పష్టంగా వివరించారు తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి.

దీనిపై వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఛార్జీలు తగ్గించడంతో పాటుగా విమానాల సర్వీసుల సంఖ్యను పెంచాలని రిక్వెస్ట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హైదరాబాద్ నుంచి 365 రోజులు భక్తులు వస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందులో సీనియర్ సిటిజెన్స్, మధ్య తరగతి కుటుంబ సభ్యులు మాత్రమే వస్తారని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో మధ్య తరగతి వాళ్ళు కూడా టికెట్లు కొనుగోలు చేసేలా ధరలు తగ్గించాలని కోరారు. కాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన ఛార్జీలు ఐదు వేలకు పైగానే ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

Next Story