- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ టెన్షన్.. టీడీపీ అటెన్షన్!
పలు కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నిక ఈరోజు ఉదయం ప్రారంభమైంది.

దిశ డైనమిక్ బ్యూరో: పలు కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నిక ఈరోజు ఉదయం ప్రారంభమైంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు, అలాగే బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్మన్ ల పదవులు, నందిగామ, హిందూపురం, పాలకొండ మునిసిపాలిటీల్లో చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్ కు అనుకూలంగా 23 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.
నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా 41 యొక్క ఓట్లు, వైసీపీకి మద్దతుగా కరీముల్లాకు 21 ఓట్లు పడ్డాయి. ఏలూరు డిప్యూటీ మేయర్ ల పదవులు టిడిపి కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. మొదటి డిప్యూటీ మేయర్ గా ఉమామహేశ్వరరావు, రెండో డిప్యూటీ మేయర్గా దుర్గ భవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధిష్టానం స్వర్ణలత పేరును ఖరారు చేసింది. అయితే ఆమెను కాదని తాను ప్రకటించిన అభ్యర్థిని ఫైనల్ చేయాలని తంగిరాల సౌమ్య పట్టు పట్టింది. ఈ పరిణామాలపై అధిష్టానం ఆరా తీసింది. నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రేపటి వాయిదా పడింది. ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేశినేని చిన్ని మధ్య అభ్యర్థి విషయంలో సయోధ్య కుదరలేదని సమాచారం.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..
ఉద్రిక్త పరిస్థితులను నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ కార్పొరేటర్లు వెళుతున్న బస్సుపై దాడి చేసి అద్దాలు పగులు కొట్టి ఎనిమిది మంది కార్పొరేటర్ ను ఎత్తుకెళ్లారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. దీంతో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ దగ్గర వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వైసీపీ కార్పొరేటర్ కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం నిరసన తెలిపారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బాయ్ కాట్చేశారు. కోరం లేక ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి శుభం భన్సల్ ప్రకటించారు.
బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ మేయర్లుగా శివ కుమార్ రెడ్డి, పఠాన్ నస్రిన్ ఎంపికయ్యారు. వారికి టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కాగా స్వతంత్ర అభ్యర్థులుగా వీరిద్దరూ పోటీ చేశారు. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్షునిగా వాయిదా పడింది. రెండో వార్డు కౌన్సిలర్ మల్లేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగారు. వైసీపీ బీఫాం ఇవ్వడంతో ఎన్నికల అధికారి పరిగణనలోకి తీసుకున్నారు. అభ్యర్థి విజ్ఞప్తి మేరకు రేపటికి ఎన్నికలు వాయిదా వేశారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిలర్లను వైసీపీ బెదిరిస్తుందని కూటమి నాయకులు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ ను వైసీపీ క్యాంపులకు తరలించిందని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియను వారు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు వాయిదా వేశారు.
కాగా గుంటూరు స్థాయి సంఘం ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి స్థాయి సంఘం ఎన్నికలు జరుగుతున్నందుకు రాజకీయంగా ఆసక్తి నెలకొంది. గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. వైసీపీ 46, టిడిపి కి తొమ్మిది, జనసేనకి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఆరు స్థాయి సంఘ సభ్యులయ పదవులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేనలో పలువురు కార్పొరేటర్లు చేరారు. కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.






