YCP మరో కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

మహిళలపై జరుగుతున్న అరాచకాలపై YSRCP మరో కీలక నిర్ణయం తీసుకుంది.

YCP మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళలపై జరుగుతున్న అరాచకాలపై YSRCP మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధం అయింది. అందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, విద్యార్థినిలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపణలు చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ నిరసనలు, ధర్నాలు చేసి.. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ కార్యక్రమంలో మహిళలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది.

Next Story