- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందుల ఎన్నికల వేళ బిగ్ షాక్.. వైసీపీ అభ్యర్థనకు హైకోర్టు నిరాకరణ
పులివెందుల ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Cogress Party) నాయకులకు హైకోర్టు(High Court)లో బిగ్ షాక్ తగిలింది. పులివెందుల ఎన్నికల్లో(Pulivendual Elections) బూత్ లను యథావిథిగా కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఆ అభ్యర్థనకు నిరాకరించింది. పోలింగ్ బూత్ మార్పు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి తెచ్చింది. దీంతో ప్రభుత్వం మార్పు చేసిన 6 బూత్‌ల్లోనే పోలింగ్ కొనసాగనుంది. హైకోర్టు తీర్పుపై గంపెడు ఆశలు పెట్టుకున్న వైసీపీ(Ycp) నేతలకు ఎదురుదెబ్బ తగిలింది.
కాగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు(Pulivendula ZPTC elections) మంగళవారం జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పులివెందుల మండలంలో ఆరు ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉండటంతో ఆయా పోలింగ్ బూత్‌లను మార్పు చేశారు. దీంతో ఈ మార్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది.






