- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు, పవన్ పై అసభ్యకర పోస్టులు.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసులు రెడ్డి రెండేళ్లుగా కువైట్ లో ఉంటుండగా వైసీసీకి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటాడు.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసులు రెడ్డి రెండేళ్లుగా కువైట్ లో ఉంటుండగా వైసీసీకి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టడంతో అతడిపై 40కిపైగా కేసులు నమోదయ్యాయి. అయితే అనారోగ్యంతో ఉన్న తన కూతురుతో పాటు కుటుంబ సభ్యులను శ్రీనివాసులు ఆస్పత్రికి తీసుకురాగా హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉంటే రాజకీయనాయకులపై సోషల్ మీడియాలో తీవ్రమైన దాడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు మరో పార్టీకి చెందిన నాయకులపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు. కేవలం నాయకులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను, మహిళలు మరియు చిన్నారులపై సైతం అసభ్యకర పోస్టులు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కేటుగాళ్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తోంది.






