వైసీపీ వల్లే మంగినపూడి బీచ్‍కు ఈ దుస్థితి : మంత్రి కొల్లు రవీంద్ర

by Naga Rani Yarlagadda |

మంగినపూడి బీచ్ ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ వల్లే నేడు బీచ్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

వైసీపీ వల్లే మంగినపూడి బీచ్‍కు ఈ దుస్థితి : మంత్రి కొల్లు రవీంద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న మంగినపూడి బీచ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. శనివారం ఆయన మంగినపూడి బీచ్ లో అత్యాధునిక టాయిలెట్స్, కాఫీ షాప్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 - 2019 మధ్య బీచ్ ను ఎంతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అలాగే అంతర్గతంగా రహదారుల్ని నిర్మించామన్నారు. కానీ.. వైసీపీ హయాంలో బీచ్ ను మూసివేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. బీచ్ అభివృద్ధికి ఏపీఎండీసీ నుంచి సీఎస్ఆర్ ఫండ్ కింద రూ.96.40 లక్షలతో డెవలప్మెంట్ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీరాజ్ నిధులు రూ.96 లక్షలతో ఇటీవలే రోడ్లు నిర్మించామని, 40 ఎకరాల్లో స్టూడియో నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. అలాగే మంగినపూడి బీచ్ లో చెన్నైకు చెందిన సంస్థ గోల్ఫ్ క్లబ్ ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 10 ఎకరాల్లో హెరిటేజ్ విలేజ్ నిర్మాణానికి సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి పూర్తయితే మచిలీపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

Next Story