- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YSRCP : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
వక్ఫ్ సవరణ చట్టం 2024(Waqf Amendement Bill 2024)కు వ్యతిరేకంగా వైసీపీ(YSRCP) సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : వక్ఫ్ సవరణ చట్టం 2024(Waqf Amendement Bill 2024)కు వ్యతిరేకంగా వైసీపీ(YSRCP) సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టంలోని సవరణలు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కూడా వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. వైసీపీ ఎప్పుడూ మైనార్టీలకు అండగా ఉంటుందని ఇటీవల వైసీపీ అధినేత జగన్(YS Jagan) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి.
ముఖ్యంగా, వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగించడం, వక్ఫ్ బోర్డులలో నామినేటెడ్ సభ్యుల నియామకం, బోర్డు నిర్వహణలో ప్రభుత్వ జోక్యం పెరగడం వంటి నిబంధనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా... కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.






