- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rangarajan : రంగరాజన్ కు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పరామర్శ
రామరాజ్యం ఆర్మీ దాడి(Rama Rajyam Army Attac)కి గురైన చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukuru Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్(Chief Priest Rangarajan)ను వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ ఆరే శ్యామల నేడు పరామర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: రామరాజ్యం ఆర్మీ దాడి(Rama Rajyam Army Attac)కి గురైన చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukuru Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్(Chief Priest Rangarajan)ను వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ ఆరే శ్యామల నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ ఆలయ అర్చకులైన ఒక గౌరవనీయ వ్యక్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని..వారి సంక్షేమం కోసం మద్దతుగా నిలుస్తామన్నారు. అధర్మంపై ధర్మం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
అర్చకుల భద్రతకు సంబంధించిన ఈ సంఘటనపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా చిలుకూరి బాలజీ అర్చకులు ధర్మ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నారని..భక్తులందరికి రంగరాజన్ అంటే తనకు మాదిరిగానే ఎంతో అభిమానమన్నారు. దళితులకు ఆలయ ప్రవేశాన్ని తన చేతులపై మోసుకుని మరి కల్పించిన ఆదర్శనీయుడన్నారు. అలాంటి మంచి వ్యక్తిపై దాడిని అంతా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ న్యాయానికి, ధర్మానికి అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేస్తున్నామన్నారు.
రామరాజ్యం ఆర్మీ పేరుతో వీరరాఘవరెడ్డి బృందం రంగరాజన్ పై దాడి చేయడంపై ఇప్పటికే సర్వత్రా ఖండనలు వ్యక్తమవుతునే ఉన్నాయి. కేంద్ర మంత్రులు మొదలుకుని సీఎం రేవంత్ రెడ్డి సహా, మంత్రుల పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు రంగరాజన్ పై దాడిని ఖండిస్తున్నారు. మరోవైపు రంగరాజన్ పై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.






