గవర్నర్ అశోక్ గజపతిరాజు స్థలంలో వైసీపీ కార్యాలయం.. ఎలా కడతారంటూ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

తన స్థలంలో వైసీపీ(Ycp) జిల్లా కార్యాలయం నిర్మించడంపై గోవా గవర్నర్, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు(Governor Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో తన స్థలాన్ని రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చారని ఆయన ఆరోపించారు....

గవర్నర్ అశోక్ గజపతిరాజు స్థలంలో వైసీపీ కార్యాలయం.. ఎలా కడతారంటూ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తన స్థలంలో వైసీపీ(Ycp) జిల్లా కార్యాలయం నిర్మించడంపై గోవా గవర్నర్, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు(Governor Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో తన స్థలాన్ని రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చారని ఆయన ఆరోపించారు. అయితే గత సంవత్సరం విజయనగరం కలెక్టర్‌(Vijayanagaram Collector)కు ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం తనపై చాలా కేసులు నమోదు చేసిందని తెలిపారు. తన స్థలంలో నిర్మించిన వైసీపీ కార్యాలయానికి అనుమతులు కూడా లేవని చెప్పారు. ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వం భూమి ఎలా మార్చారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు కూడా చేపట్టడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ స్థలానికి సంబంధించి భూ రికార్డులపై పూర్థి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. తమ భూమిని కాపాడుకునేందుకు చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తానని అశోక్ గజపతిరాజు హెచ్చరించారు.

Next Story