- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఎంపీల భేటీ.. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్ణయం
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రకార్యాలయంలో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల(Parliament sessions) నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రకార్యాలయంలో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం(Central Government) ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు మద్దతు ఇవ్వాలని, అలాగే మరికొన్ని బిల్లులను వ్యతిరేకించాలని నిర్ణయించారు. ప్రధానంగా రాజకీయ నేతలు 30 రోజులు జైల్లో ఉంటే పోటీకి అనర్హుడిగా ప్రకటించాలన్న బిల్లును వ్యతిరేకించాలని పార్టీ ఎంపీలకు జగన్ సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని సూచించారు. టెట్ ఎగ్జామ్ రద్దుతో పాటు నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేయాలని ఎంపీలకు జగన్ తెలిపారు.
మావిగన్ ఆలోచన అద్భుతం
ఏపీ రాజధానిపై జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచన అద్భుతమని ఆ పార్టీ ఎంపీ గొల్లబాబూరావు పేర్కొన్నారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నేతలు 30 రోజులు జైల్లో ఉంటే పోటీకి అనర్హుడిగా ప్రకటించాలనుకోవడం అన్యాయమని చెప్పారు. ఆ బిల్లును కచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. అమరావతి అనేది ఓ భ్రమ అని విమర్శించారు. రూ.2 లక్షల కోట్లతో ఎప్పుడు అమరావతిని నిర్మించాలని ప్రశ్నించారు. తక్కువ ఖర్చుతో మావిగన్‌ను బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తామని గొల్లబాబూరావు తెలిపారు.






