Mp Vijayasai Reddy: సీబీఐ కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-11-06 13:59:09  IST  )

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు...

Mp Vijayasai Reddy: సీబీఐ కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) సీబీఐ కోర్టు(CBI Court)ను ఆశ్రయించారు. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారించనుంది. వైఎస్ జగన్(YS Jagan) ఆస్తుల వ్యవహారంతో పాటు పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. గతంలో జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ కేసుల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనపై కోర్టు నిషేధం విధించింది. అయితే ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకూ విజయసాయిరెడ్డి అమెరికా(America)తో పాటు ఫ్రాన్స్(France) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సీబీఐ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని అంటోంది. దీంతో విజయసాయిరెడ్డి పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీబీఐ కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

Next Story