MP: చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్ మంచి నాయకుడు

by Gantepaka Srikanth |

కాకినాడ పోర్ట్(Kakinada Port), లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) స్పందించారు.

MP: చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్ మంచి నాయకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ పోర్ట్(Kakinada Port), లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) స్పందించారు. తాను అరెస్టులకు భయపడే వ్యక్తని కాదని అన్నారు. ముందస్తు బెయిల్ కూడా కోరను అని తెలిపారు. 1997 నుంచి కాకినాడ సీపోర్టులో ఏం జరిగిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు(Chandrababu), లోకేష్ కంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మంచి నాయకుడు అని కొనియాడారు.

ఇదిలా ఉండగా.. విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం(Andhra Pradesh CID Department) లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డిపైనా ఎల్‌వోసీ ఇచ్చింది. వీరు ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్‌ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు.

Next Story