టెర్ర‌రిస్ట్ లాగా న‌న్ను చూశారు..జైలు జీవితంపై మిథున్ రెడ్డి సంచ‌ల‌నం!

by velandi.Saikiran |   (  Updated:2025-10-01 05:57:56  IST  )

తనను టెర్రరిస్టులాగా జైల్లో చూశారని... సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో...

టెర్ర‌రిస్ట్ లాగా న‌న్ను చూశారు..జైలు జీవితంపై మిథున్ రెడ్డి సంచ‌ల‌నం!
X

దిశ‌, వెబ్ డెస్క్: తనను టెర్రరిస్టులాగా జైల్లో చూశారని... సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో... రెండు రోజుల కిందట జైలు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ పెట్టి.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. తనను జైల్లో... అత్యంత దారుణంగా అధికారులు తనతో వ్యవహరించారని మండిపడ్డారు. తన లాకప్ లో అన్ని కెమెరాలు పెట్టారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. తాను జైల్లో ఏది చేసినా... విజయవాడలో చూసేలా ఏర్పాట్లు చేశారని... సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.

తెలుగుదేశం ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వేధించడానికి తనపై కేసులు పెట్టారని మండిపడ్డ మిథున్ రెడ్డి.... దేవుడి దయ వల్ల బయటకు వచ్చానని వివరించారు. 73 రోజులపాటు తనను జైల్లో పెట్టారని.. పక్క ఖైదీ తో కూడా మాట్లాడకుండా ఇబ్బందులు పెట్టినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన గౌరవ కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని... ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను... గాలికి వదిలేసి.. వైసిపి నాయకులను అరెస్టు చేసి డైవర్షన్... చేస్తున్నారని మండిపడ్డారు. జైల్లో పడ్డ తనకు ప్రజలు అండగా ఉండడం గొప్ప విషయం అని తెలిపారు.

Next Story