- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: బీఏసీ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేల డుమ్మా
by Vemula.Srinu Prasad |
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ భవనంలో జరుగుతున్న బీఏసీ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇవాళ జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నల్ల కండువాలతో అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే జగన్ సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే బీఏసీ సమావేశానికి రావాలని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం నుంచి ఆహ్వానించారు. కానీ బీఏసీ సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రవేశ పెట్టబోయే బిల్లులపై చర్చిస్తున్నారు.
Next Story






