అభిమానుల జోష్.. వైసీపీ ఎమ్మెల్యే డాన్స్ అదుర్స్..

by Disha Web Desk 3 |
అభిమానుల జోష్.. వైసీపీ ఎమ్మెల్యే డాన్స్ అదుర్స్..
X

దిశ వెబ్ డెస్క్: ఆనందాన్ని కోరుకోని వాళ్లంటూ ఎవరు ఉండరు. అభిమాన హీరో సినిమాని చూస్తూ బీట్ సాంగ్స్ కి డాన్సులు వేస్తూ.. ఈలలేస్తూ కేరింతలు కొట్టేవారిని చూస్తే ఓ స్థాయిలో ఉన్నవారు కచింతంగా మేము అలా ఎంజాయ్ చెయ్యలేక పోతున్నామే అని భాధపడతారు. ఎందుకంటే ఓ స్థాయిలో ఉన్నప్పుడు పైనపడిన పెద్దరికం ఎంజాయ్ చెయ్యాలని ఉన్న ఎంజాయ్ చెయ్యనీకుండా ఆపుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయుకులు చాలామంది ఈ కోవలోకి వస్తారు.

అయితే ఎప్పుడైనా అలా ఎంజాయ్ చేసే అవకాశం వస్తే మాత్రం ఎవరు వదులుకోరు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే విషయం లోనూ అదే జరిగింది. కైకలూరులో గుంటూరు కారం సినిమా థియేటర్ ఎదురుగా మహేష్ బాబు ఫాన్స్ ధూమ్ దాం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అభిమానులను కలిశారు వైసీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ.

ఇంకేముంది అసలే అభిమాన హీరో సిసినిమా.. అభిమానులు మహేష్ బాబు పాటలకుడాన్స్ దుమ్ములేపుతున్నారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేని కూడా ఓ స్టెప్ వెయ్యమన్నారు. దీనితో రోగి కోరింది పెరుగన్నమే వైద్యుడు చెప్పింది పెరుగన్నమే అని మనసులో ఎంజాయ్ చెయ్యాలని ఎప్పటి నుండి ఉందో గాని అభిమానులతో కలిసి చిందులేశారు వైసీపీ ఎమ్మెల్యే. దీనితో అటు అభిమానులు కూడా ఎమ్మెల్యేకి ఫిదా అయ్యారు.



Next Story

Most Viewed