పోటీ చేయ్.. లేదంటే అలా చేయ్.. పవన్‌కు ద్వారంపూడి మళ్లీ సవాల్

by Disha Web Desk 16 |
పోటీ చేయ్.. లేదంటే అలా చేయ్.. పవన్‌కు ద్వారంపూడి మళ్లీ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన కనీసం గాజు గుర్తుతో తనపై పోటీ పెట్టాలని ఆయన ఛాలెంజ్ చేశారు. తన సవాల్‌కు పవన్ కల్యాణ్ స్పందించాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ కాకినాడలో పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తానని హెచ్చరించారు. గతంలోనూ ఇదే చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని ద్వారంపూడి పేర్కొన్నారు. సీఎం జగన్ తనకు టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. జగన్ కుటుంబంతో ఎప్పుడూ విధేయతగానే ఉంటామన్నారు. తన సీటును సీఎం జగన్ త్వరలో ప్రకటిస్తారని ద్వారంపూడి తెలిపారు.

కాగా వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సర్వేల ఆధారంగా పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తున్నారు. మరికొందరిని నియోజకవర్గాలను మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేశారు. అయితే ఈ లిస్టులో కాకినాడ లేదు. కాకినాడ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మూడు జాబితాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఉంటుందేమో చూడాలి.

Next Story