- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ (T.Chandra Shekar) విమర్శల వర్షం కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ (T.Chandra Shekar) విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం అప్పులను తెచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తోందనే కోణంలో ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా విమర్శల వర్షాన్ని కురిపించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆర్బీఐ వేలంపాటకు వెళ్తోందన్నారు. డిసెంబర్ 30న సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టాలని చూస్తోందన్నారు. తద్వారా రూ.4వేల కోట్లు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే తీసుకొచ్చే అప్పుకు వడ్డీ రేటు ఎంతో తెలియదన్నారు. వడ్డీ రేటు ఎంతున్నా కూడా అప్పు తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. లేదంటే పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదంటూ విమర్శించారు. ప్రణాళిక లేకపోవడం వల్ల ఆర్బీఐ దగ్గర ఏపీ దేహి అనే పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దయాదాక్షిణ్యాల మీద పింఛనర్లు ఆధారపడే పరిస్థితికి రాష్ట్రం వచ్చిందన్నారు. డిసెంబర్ 30న అప్పు పుట్టాలని, డిసెంబర్ 31న పింఛన్ రావాలని పింఛనర్లు దేవుడిపై భారం వేయడం తప్పితే ఏం చేయలేని పరిస్థితి నెలకొందంటూ నిట్టూర్చారు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి.. హామీలు నెరవేరుస్తుంది కాబట్టి నమ్మాలన్నారు.
అయితే వైసీపీ నేతల ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. వైసీపీ పాలనలో చేసిన అప్పులు, ఆర్థిక తప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందంటున్నారు. పరిశ్రమలు రాక, పెట్టబడులు వెళ్లిపోయాక రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ సాధారణ స్థితికి తెస్తోందంటున్నారు. ఖజానాలో నిధులను పప్పుబెల్లాల మాదిరి పంచిపెట్టిన వారు ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదంటున్నారు. పెట్టుబడులు, అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో త్వరలోనే అత్యుత్తమ ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీ మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.






