- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం లేదు.. ఈసీకి వైసీపీ కంప్లైంట్
ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు మున్సిపల్(Thiruvur Municipality) చైర్ పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు మున్సిపల్(Thiruvur Municipality) చైర్ పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఏడాది క్రితం వరకు 17మంది కౌన్సిలర్లతో తిరువూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట, వర్గపోరు కారణంగా.. తిరువూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ కోసం ఎన్నిక అనివార్యమైంది. అయితే.. రేపు(మంగళవారం) ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ నేతలు ఎన్నికల సంఘం(Election Commissioner) అధికారులను కలిశారు. తిరువూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై ఫిర్యాదు చేశారు. రేపు ఎన్నిక దృష్ట్యా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకి 15 మంది సభ్యుల బలం ఉన్నా ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. పోలీసులు తొత్తులుగా పనిచేయొద్దని కోరారు. రేపు ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం లేదు. మాపై మరోసారి దాడికి యత్నించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. అందుకని భారీ భద్రత నడుమ ఎన్నిక నిర్వహించాలని కోరారు. రేపు ఉదయం ఎన్నిక ఉండగా.. ఇప్పటినుంచే మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






