- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి సుప్రీకోర్టు ఆదేశాలతో నేడు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. దీంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ర్యాలీలు తీసేందుకు సిద్ధం అవ్వగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
ర్యాలీలకు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజినిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పల్నాడు జిల్లాలో గత నెల మే24న టీడీపీ నేతలు వెంకటేశ్వర రావు, కోటేశ్వరరావుల హత్యలు జరిగాయి. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులుగా ఉన్నారు. నేడు వారు లొంగిపోనున్న నేపథ్యంలో కోర్టు వారికి ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.






