- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్‌కు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం: ప్రభుత్వంపై గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు
జగన్‌కు భద్రత విషయంలోప్రభుత్వంపై గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు మిర్చి యార్డు వద్ద జగన్ పర్యటన నేపథ్యంలో బుధవారం చోటు చేసుకున్న ఘటనపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. మిర్చి రైతుల పరామర్శ సమయంలో జగన్‌కు పోలీస్ భద్రత కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను తాజాగా కలిశారు. జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని ఫిర్యాదు చేశారు. ఇక నుంచైనా జగన్‌కు పటిష్ట భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు.
మరోవైపు జగన్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉందని, ఈ నిబంధనను జగన్ ఉల్లంఘించారంటూ జగన్‌తో పాటు పలువురిపైనా కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపైనా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు.






