వైసీపీ నేతలు అబద్ధాల ప్రచారానికి దిగుతున్నారు : దేవినేని ఉమ

by Thanuru Gopichand |

రాజకీయ పరాభవాన్ని జీర్ణించుకోలేక తిరుమల లడ్డు తయారీలో కల్తీ చేసి కొవ్వు లేదని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

వైసీపీ నేతలు అబద్ధాల ప్రచారానికి దిగుతున్నారు : దేవినేని ఉమ
X

దిశ, వెబ్ డెస్క్ : అధికారం కోసం అర్రులు చాస్తున్న వైసీపీ నేతలు తమ మీడియా సంస్థల ద్వారా రోజూ అబద్ధాల ప్రచారానికి దిగుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. గొల్లపూడిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యతను వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా మర్చిపోయారన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా పశ్చాత్తాపం లేకుండా అబద్ధాలు, అసత్యాలు వండివారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతలు రాజకీయ పరాభవాన్ని జీర్ణించుకోలేక తిరుమల లడ్డు తయారీలో కల్తీ చేసి కొవ్వు లేదని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజారాజధాని అమరావతిని గుర్తించకుండా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్న అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. రాజధాని విషయంలో ప్రజల మనోభావాలను వైసీపీ పూర్తిగా త్రోసిపుచ్చిందన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రతినెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగా(జనవరి 31) పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. కొత్తగా మంజూరైన వితంతువుల పెన్షన్లు 7,944తో కలిపి మొత్తం 62.94 లక్షల మంది పెన్షన్‌దారులకు రూ.2,724 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నిజమైన ప్రజాసంక్షేమానికి నిదర్శనమని తెలియజేశారు. వైసీపీ పాలనలో పేదల హక్కులు కాలరాయబడ్డాయని, ఇప్పుడు వాస్తవాలు ప్రజలకు చెప్పి చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్తపై ఉందని సూచించారు.

Next Story