- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ యాంకర్ సంచలన వీడియో !
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ( AP Deputy CM Pawan Kalyan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైస్సార్సీపీ ఆంధ్ర ప్రదేశ్

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ( AP Deputy CM Pawan Kalyan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైస్సార్సీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ( Anchor Shymala). PPP-పిఠాపురం ( Pitapuram) పిఠాధిపతి పవన్ కళ్యాణ్... మీ ఇలాకా పిఠాపురంలో దళితుల దుస్థితి ఇది...సిగ్గు పడాలి అంటూ ఫైర్ అయ్యారు శ్యామల. పిఠాపురం నియోజకవర్గంలో పల్లెపు సురేష్ ( pallepu suresh) అనే వ్యక్తి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పలువురు దళితులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే దళితులకు సాంఘిక బహిష్కరణ విధించారని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా వైసిపి అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు.
మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ( Pithapuram Constituency) ఓ దళిత యువకుడు కరెంట్ షాక్ తో ( Current shock) మరణించాడు అని ఫైర్ అయ్యారు. అయితే ఆ దళిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరినందుకు మల్లాం గ్రామస్తులు మొత్తం దళితులను వెలివేశారని మండిపడ్డారు యాంకర్ శ్యామల. పొలం పనులకు పిలవడం లేదని... వారికి పాలు కూడా పోయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ దళిత కుటుంబాలు అల్లాడిపోతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయ్యారు శ్యామల. ఇదేనా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ప్రజలకు న్యాయం చేయడం అంటూ ఓ వీడియో విడుదల చేసి రెచ్చిపోయారు యాంకర్ శ్యామల.






