- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేస్తూ.. పవన్ కల్యాణ్ సినిమాపై రోజా విమర్శలు
జూనియర్ ఎన్టీఆర్(NTR)కు సపోర్ట్ చేస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Roja) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్(NTR)కు సపోర్ట్ చేస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Roja) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్‌పై స్పందించారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. రాజకీయాల్లో లేని వారిపై ఇంత అసభ్యంగా మాట్లాడటాన్ని ఎవరూ సమర్థించరు అని మండిపడ్డారు. సినిమాలు, రాజకీయాలను వేరు వేరుగా చూడాలని చెప్పారు. సినిమాలు బాగుంటే ఎవరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో విషయం ఉంటే తప్పకుండా జనాలు వెళ్తారు.. చూస్తారు.. ఎవరు ఆపినా ఆగరు అని అన్నారు. ఎమ్మెల్యేలంతా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నా కూడా పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని చూడలేదు. నచ్చకపోతే ఎంత బలవంత పెట్టినా చూడరు.. నచ్చితే ఎవరు అడ్డుకోలేరు అని అన్నారు. కాగా, ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. ఆ ఆడియో తనది కాదని, ఇది రాజకీయ కుట్ర అని దగ్గుపాటి ప్రసాద్ ఖండిస్తూ అభిమానులను శాంతింపజేయడానికి క్షమాపణలు తెలిపారు.






