- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారా లోకేశ్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మహిళ అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడాడని దుయ్యబట్టారు. ..

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మహిళ అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడాడని దుయ్యబట్టారు. నారా లోకేశ్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని విమర్శించారు. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. సీమన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై లోతుగా విచారణ జరపాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డిమాండ్ చేశారు.
త్వరలో టీడీపీలోకి బైరెడ్డి?
ఇదిలా ఉంటే రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన టీడీపీతో పాటు పలు పార్టీల్లో పని చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. త్వరలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనయుడు అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. నారా లోకేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.






