- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై.. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ కీలక నిర్ణయం
నిండు పార్లమెంట్ సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడారు...

దిశ, వెబ్ డెస్క్: నిండు పార్లమెంట్(Parliament) సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr congress Party) మద్దతు తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy) మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం హయాంలో ఏపీ స్థానిక ఎన్నికల్లో మహిళలకు కల్పించిన 50 రిజర్వేషన్‌ను ఆయన గుర్తు చేశారు. డీలిమిటేషన్(Delimitation)తో ఏ రాష్ట్రంలోనూ ప్రాంతీయ అసమానతలు రాకుండా చూడాలని కేంద్రప్రభుత్వాన్ని ఎంపీ మిధున్ రెడ్డి కోరారు. అలాగే ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్ మారొద్దని సూచించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయని ఆరోపించారు. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వేధింపులు ఆడియోలు, వీడియోలు సైతం బయటకి వచ్చాయని, అయితే వేధించిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని పార్లమెంట్ సాక్షిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






