- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోరుబాట ఉధృతం.. 9న నర్సీపట్నంకు సీఎం జగన్
మెడికల్ కాలేజీలపై వైసీపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీల(Medical Colleges) నిర్మాణం కోసం ప్రభుత్వం పీపీపీ(PPP) విధానాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విధానాన్ని వైసీపీ(Ycp) వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తోంది. అంతేకాదు మెడికల్ కాలేజీలను కాపాడలంటూ నిరసన కార్యక్రమాలకు సిద్ధమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రైవేటు పరం చేసే బదులు నిధులు కేటాయిస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి అవుతాయని వ్యాఖ్యానించారు.
అయితే మెడికల్ కాలేజీల కోసం పోరుబాట కార్యక్రమానికి తాజాగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) ఈ నెల 9న నర్సీపట్నం వెళ్లనున్నారు. అక్కడి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చించాలని పట్టుబట్టామని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, సంక్షేమం, అభివృద్ధే తమ పార్టీ అజెండా అని ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ తెలిపారు.






