Hyper Aadi: జనసేన సభ ఎఫెక్ట్ ..హైపర్ ఆదిపై వైసీపీ భారీ కుట్ర!

by Disha Web Desk 2 |
Hyper Aadi: జనసేన సభ ఎఫెక్ట్ ..హైపర్ ఆదిపై వైసీపీ భారీ కుట్ర!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర కమెడియన్‌గా సినీ కెరీర్‌ను ఆరభించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం హైపర్ ఆది అంటే తెలియని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఉండరు. ఇటు బుల్లితెరపై, అటు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతేగాక, ఇటీవల రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తోన్న వైసీపీ నేతలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా.. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శ్రీకాకులం జిల్లా రణస్థలిలో నిర్వహించిన 'యువశక్తి' కార్యక్రమంలో ఆది పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో హైపర్ ఆదిపై వైసీపీ నాయకులు కన్నేశారు. ఎలాగైనా ఆది నోరు మూయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో.. 'హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చేసింది. ఫోన్ చేసి అందరూ పద్ధతిగా పలకరించండి' అంటూ ఫోన్ నెంబర్ పెట్టి టార్చర్ చేయడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. మరి వైసీపీ నేతల ఫోన్ కాల్స్‌కు హైపర్ ఆది ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Read more:

మొరగడం మొదలెట్టిన వైసీపీ మగ ముత్తైదువలు: నాగబాబు

Next Story