మొరగడం మొదలెట్టిన వైసీపీ మగ ముత్తైదువలు: నాగబాబు

by Chukka Sudharani |

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘రణస్థలి’ సభతో ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి.

మొరగడం మొదలెట్టిన వైసీపీ మగ ముత్తైదువలు: నాగబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'రణస్థలి' సభతో ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. యువ శక్తి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, మంత్రులు పనన్ కళ్యాణ్‌కు రీ కౌంటర్‌లు వేశారు. ఇక వీటిపై స్పందించిన జనసేన పార్టీ నేత నాగబాబు ఈ విధంగా ట్వీట్ చేశారు. ''వైసీపీ పార్టీ మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొదగడం మొదలు పెట్టారు.. వాయినాలు ఇచ్చి పంపండి..!'' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా.. మరోసారి సోషల్ మీడియాలో జనసేనా పార్టీ నేతలు, వైసీపీ పార్టీ నేతల మధ్య వార్ షురూ అయింది. కాగా.. నిన్న జరిగిన సభలో సైతం నాగబాబు అధికార పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Next Story