రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన.. వాళ్లను ఆదుకోవాలంటూ రోజా డిమాండ్

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం ఘటనపై వైసీపీ పోరుబాటను ఉధృతంగా చేసింది....

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన.. వాళ్లను ఆదుకోవాలంటూ రోజా డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం(Fake alcohol) ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పోరుబాటను ఉధృతంగా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ములకలచెరువు(MulakalaCheruvu), ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో నకిలీ మద్యం రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే పోలీసులు తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ నేతలు జయచంద్రా రెడ్డి, జనార్ధన్ గౌడ్ దొరికిపోయారని తెలిపారు. వాళ్లిద్దరు కోవర్టులు అయితే సీట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతి డబ్బు కోసమే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ మద్దతుతోనే నకిలీ మద్యం తయారు చేశారని వ్యాఖ్యానించారు. నకిలీ మద్యంపై చనిపోయిన వారి కటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని రోజా హామీ ఇచ్చారు.

చిలకలూరిపేట ఎక్సైజ్‌ ఆఫీసు దగ్గర మాజీ మంత్రి విడదల రజినీ నిరసన వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ సీఐకి వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, ఘటనపై సీబీఐ విచారణ జరపాలని రజినీ డిమాండ్ చేశారు.

Next Story