- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరాలలోనూ వైసీపీకి బిగ్ షాక్..మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు రాజీనామా
చీరాలలోనూ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది..

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చీరాల(Chirala)లోనూ వైసీపీ(Ycp)కి బిగ్ షాక్ తలిగింది. ఇప్పటికే శాసనమండలి చైర్ పర్సన్ జకీయ ఖానమ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. సాధారణ ఎన్నికలు జరిగిన నాటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతున్నారు. రాజీనామా చేసి వేరే కూటమి పార్టీల్లో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలో చేరిపోయారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా వైసీపీ నుంచి చేజారిపోయాయి.
తాజాగా చీరాల మున్సిపాలిటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆయన ముందస్తు రాజీనామా చేశారు. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అయితే పార్టీ ఓటమితో పరిస్థితి తారుమారు అయింది. టీడీపీకి ఇప్పటికే 15 మందికి పైగా కౌన్సిలర్లు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్ గా ఉన్న జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం కౌన్సిలర్లు ప్రస్తుతం టీడీపీకి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీలో ఆసక్తికర రాజకీయం కొనసాగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.






