- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: పూడి శ్రీహరికి అంబటి భరోసా
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని ఆదివారం పరామర్శించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా శ్రీహరిపై అక్రమ కేసులు బనాయించి, వరుసగా రెండుసార్లు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు..

దిశ, వెబ్ డెస్క్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి(YSR Congress Party State General Secretary Pudi Srihari)ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని(Former ministers Ambati Rambabu and Vidadala Rajini) ఆదివారం పరామర్శించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా శ్రీహరిపై అక్రమ కేసులు బనాయించి, వరుసగా రెండుసార్లు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో 41A నోటీసులు ఇచ్చి విచారించాలే తప్ప, అరెస్టులు చేయకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి వేధించిందని వారు మండిపడ్డారు.
జగన్ శ్రమను ప్రత్యక్షంగా చూశాం..
ఈ సందర్భంగా పూడి శ్రీహరి(Pudi Srihari)మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) లాంటి నిబద్ధత కలిగిన నాయకుడు భవిష్యత్తులో రావడం కష్టమని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే బలమైన సంకల్పంతో జగన్(Jagan) పని చేశారని పేర్కొన్నారు. సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఆయన అహోరాత్రులు పడిన శ్రమను తాము ప్రత్యక్షంగా చూశామని శ్రీహరి గుర్తు చేసుకున్నారు.
ప్రజల జీవన ప్రమాణాల మెరుగే లక్ష్యం
వైసీపీ లక్ష్యం ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమేనని, ఇటువంటి అక్రమ అరెస్టులు, వేధింపులతో తమ పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని ఈ పరామర్శలో నేతలు స్పష్టం చేశారు. గత శుక్రవారం కోర్టు నుంచి బెయిల్ పొంది విడుదలైన శ్రీహరిని కలిసి, పార్టీ ఆయనకు వెన్నంటి ఉంటుందని మాజీ మంత్రులు ధైర్యం చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన తమ పోరాటం కొనసాగుతుందని అంబటి, రజిని స్పష్టం చేశారు.






