- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ అభిమాని సెల్ఫీ వీడియో.. ఆపై ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. పల్నాడు జిల్లా నరకులపాడు (Narakulapadu) గ్రామంలో చిన్న గోపి (అలియాస్ చిన్నీ) అనే వైసీపీ కార్యకర్త, అధికారపక్షం వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. పల్నాడు జిల్లా నరకులపాడు (Narakulapadu) గ్రామంలో చిన్న గోపి (అలియాస్ చిన్నీ) అనే వైసీపీ కార్యకర్త, అధికారపక్షం వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా తమను గ్రామంలో అడుగుపెట్టనివ్వకుండా అధికారపక్ష నాయకులు అడ్డుకుంటున్నారని సెల్ఫీ వీడియోలో చిన్నీ ఆరోపించారు. సొంత ఊరిలో చావులకు, శుభకార్యాలకు రావాలన్నా తీవ్ర ఆంక్షలు విధిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన తన ఆవేదనను వీడియోలో పంచుకున్నారు. గ్రామాల్లోకి వస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని వాపోయారు. అంతేకాకుండా తపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. చివరకు ఆడవాళ్లను, పిల్లలను కూడా వదలకుండా భయపెడుతున్నారని చిన్నీ కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ, కేవలం రాజకీయ విభేదాల కారణంగా ఒక సామాన్య కార్యకర్తను నిరాశ్రయుడిని చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారిందని అన్నారు. తన మరణానికి గ్రామంలోని అధికారపక్ష నేతల వైఖరే కారణమని చిన్నీ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నారు.
అధికారపక్షం చేస్తున్న అరాచకాలను భరించలేక, తన గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక చిన్నీ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. దాడులు, బెదిరింపుల కారణంగా తన కుటుంబం అనుభవిస్తున్న నరకాన్ని వీడియోలో వివరిస్తూ, తన మరణానికైనా న్యాయం జరగాలని కోరడం వీడియో చూసిన వార మనసులను కలచివేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా, రాజకీయ కక్షల వల్లే చిన్న గోపి ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. చిన్నీ బలవనర్మరణానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.






