- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు గొడ్డలితో వస్తారు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఓడిపోయాం రేపు కచ్చితంగా గెలుస్తామని అన్నారు. గెలిచిన తరవాత చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఎప్పుడూ మంచితనంతో ఉంటే పనికిరాదని వాళ్లే నేర్పించారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరో వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఓడిపోయాం రేపు కచ్చితంగా గెలుస్తామని అన్నారు. గెలిచిన తరవాత చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఎప్పుడూ మంచితనంతో ఉంటే పనికిరాదని వాళ్లే నేర్పించారని అన్నారు.
కాస్త కఠినంగా ఉంటేనే భయం భక్తి ఉంటాయన్నారు. గతంలో కర్ర పట్టుకుని వచ్చేవాళ్లు రేపు గొడ్డలితో వస్తారని అన్నారు. తెగించే వరకు తీసుకెళ్లారని, తెగించిన తరవాత తట్టుకునే స్థాయి టీడీపీ నేతలకు లేదని వార్నింగ్ ఇచ్చారు. వీధి వీధిలో పరిగెత్తించి కొడతారని అన్నారు. మంచికి విలువలేదని ఈసారి తాట తీయకుండా వదలం అని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పేర్కి నాని చేసిన రప్పా రప్పా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.






