చంద్రబాబును జైల్లోనే చంపేందుకు వైసీపీ కుట్రలు : Nara Lokesh

by Seetharam |   (  Updated:2023-09-21 08:12:40  IST  )

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అంతమెుందిచేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.

Nara Lokesh
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అంతమెుందిచేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యత అని లోకేశ్ అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం తమకు కలుగుతుందని చెప్పుకొచ్చారు. ‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారు. చంద్రబాబునూ ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకుకి ఏం జరిగినా సైకో జగన్‌దే బాధ్యత’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Read More..

వైసీపీ ఎమ్మెల్యేలు మందబలంతో విర్రవీగుతున్నారు : నందమూరి బాలకృష్ణ

Next Story