Breaking: రేపు జగన్ కీలక సమావేశం.. కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్‌ భేటీ కానున్నారు....

Breaking: రేపు జగన్ కీలక సమావేశం.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్‌ భేటీ మేరకు ఆయన గ్రౌండ్ లెవల్‌లో పార్టీపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా బుధవారం కీలక సమావేశం(key meeting) నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతల్లో నిరుత్సాహం నెలకొందని ఆయనకు రిపోర్స్ అందాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్‌గా లోకల్ నాయకులను తాను కలవాలని ఫిక్స్ అయ్యారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల(Public Representatives)తో బుధవారం జగన్ భేటీ కానున్నారు. నాలుగు జిల్లాల ప్రజా ప్రతినిధులను మంగళగిరి పార్టీ వైసీపీ కార్యాలయంలో భేటీకి ఏర్పాట్లు చేశారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.

అయితే ఈ సమావేశంలో వైసీపీ(Ycp) బలోపేతానికి చేయాల్సిన కృషిని ప్రజా ప్రతినిధులకు జగన్ వివరించనున్నారు. అలాగే పార్టీలో మార్పులు, చేర్పులపైనా నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని సైతం నేతలకు వివరించనున్నారు. ఇలాగే రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలకైనా ఇలాగే కృషి చేయాలని జగన్ సూచించారు. అలాగే పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని తెలపనున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని పోరాటం చేయాలని జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని చెప్పనున్నారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ నేతలపై నమోదు కేసులకు సంబంధించి పార్టీ ప్రజా ప్రతినిధులకు కీలక సూచనలు చేయనున్నారు. కేసులకు భయపడొద్దని, తాను అండగా ఉంటానని నేతలకు సీఎం జగన్ భరోసా ఇవ్వనున్నారు.

Next Story