- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చలో మెడికల్ కాలేజీ’లకు YCP పిలుపు.. మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్
మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో మెడికల్ కాలేజీలు’ నినాదంతో వైసీపీ (YCP) ఆందోళనలకు పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) ‘చలో మెడికల్ కాలేజీలు’ నినాదంతో ఆందోళనలకు పిలుపునిచ్చింది. మరోవైపు వారికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ (SFI) కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పలువురు నేతలను ఉదయం నుంచి అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుకు (Chelluboina Venu) చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ చేశారు. ఇక దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి, వైసీపీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, భార్గవ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
మరోవైపు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీ లోపల.. బయట వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. శాసన మండలిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ వాయిదా తీర్మానం అందజేసింది.






