- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడివాడలో టెన్షన్ టెన్షన్
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో నాగవరప్పాడులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో నాగవరప్పాడులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగనుంది. కాగా సాయంత్రం 4గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించనున్నారు. గుడివాడలోని కే కన్వెన్షన్ లో బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తారు.
కాగా ఈ కార్యక్రమానికి వెళ్లాలంటే నాగవరప్పాడు మీదుగానే వెళ్లాలి. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కొడాలి బూట్లు పాలిష్ చేస్తున్నట్లు గుడివాడ నెహ్రు చౌక్ సెంటర్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేస్తానంటూ కొడాలి నాని సవాల్ చేశారు. కొడాలి నాని చేసిన సవాల్ ను నిలబెట్టుకోవాలంటూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జిల్లాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.






