- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: వైఎస్ జగన్‌తో పాటు ఆరుగురిపై కేసు
వైసీపీ కార్యకర్తల సింగయ్య మృతి కేసు పలు కీలక మలుపు తిరిగింది...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కార్యకర్తల సింగయ్య మృతి కేసు పలు కీలక మలుపు తిరిగింది. తొలుత వైఎస్ జగన్(Ys Jagan) కాన్వాయ్‌లోని వాహనం తగిలి సింగయ్య(Singaiah) మృతి చెందారని ప్రాథమికంగా పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన వీడియో వైరల్ అయింది. దీంతో సింగయ్య మృతి, కేసులపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్(Sp Satish Kumar) స్పష్టత ఇచ్చారు. జగన్ కారు చక్రాల కిందపడి సింగయ్య మృతి చెందారని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో వైఎస్ జగన్‌ను నిందితుడిగా చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోని సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించామని, జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు వీడియోలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఆ దృశ్యాలు చూసిన తర్వాత మళ్లీ సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశామని చెప్పారు. కారు డ్రైవర్ రమణారెడ్డితో పాటు వైఎస్ జగన్, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజినిపై కేసు నమోదు చేశామన్నారు. దొరికిన ఆధారాలతో కేసు విచారణ చేపట్టామని చెప్పారు. 14 వాహనాలకు మాత్రమే అనుమతిచ్చామని, కానీ 50 వాహనాల్లో వైసీపీ శ్రేణులు వచ్చారన్నారు. చట్ట పరంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు.






