రాసిపెట్టుకోండి.. మళ్లీ గెలిచేది ఎన్డీఏనే..

by Thanuru Gopichand |

దేశంలో, రాష్ట్రంలో 2029 ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

రాసిపెట్టుకోండి.. మళ్లీ గెలిచేది ఎన్డీఏనే..
X

మరోసారి మోడీ పీఎం అవుతారు

నాలెడ్జి ఎకానమీగా రాజధాని అమరావతి

పోలవరాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

దిశ, డైనమిక్​ బ్యూరో : దేశంలో, రాష్ట్రంలో 2029 ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కావాలంటే రాసిపెట్టుకోండని, 2029లో నరేంద్ర మోడీ నాలుగోసారి పీఎం అవు తారని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఓ మీడియా కాంక్లేవ్​లో ఇవాళ ఆయన మాట్లాడారు. ఆలస్యంగా సాధించే విజన్ 2020, 2047 వల్ల రాజకీయంగా నష్టమేమీ ఉండదన్నారు. 2038 నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి నంబర్​వన ఎకానమీగా అవతరించాలని ఆకాంక్షించారు. అందులో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి, రాజకీయ ప్రయోజనాలు.. ఇలా రెండింటి కోసం కష్టపడాల్సిన అవసరముందని తెలిపారు. అందుకే సూపర్-6 అమలు చేశామని, అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడులు పెంచామని పేర్కొన్నారు. వృద్ధి రేటును 17శాతానికి పెంచేలా కృషి చేస్తున్నానని వెల్లడించారు. రాజకీయ ప్రయో జనాల గురించి ఆలోచిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందేది కాదని చంద్రబాబు తెలిపారు.

అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు

రాబోయే మూడేళ్లలో అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు పూర్తవుతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతిని నాలెడ్జ్ ఎకానమీగా, క్వాంటం సిటీగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పోలవరం రాష్ట్రానికి ఎంతో కీలకమని, మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 740 కిలోమీటర్ల దూరం కృష్ణమ్మను తరలించి రాయలసీమకు, కుప్పానికి నీరు అందించామని వివరించారు. కష్టాల్లోనూ ఈ ఏడాది రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరముందని తెలిపారు. అభివృద్ధి కోసమే పీపీపీ మోడల్స్ అనుసరిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఇవే అమలవుతున్నాయని తెలిపారు. దీని ద్వారా సంపద సృష్టి జరిగి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఆ ఆదాయంతో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసే శక్తి వస్తుందన్నారు. అందుకే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నామని చంద్రబాబు తెలిపారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్​ కాలేజీలు

మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపైనా సీఎం చంద్రబాబు స్పందించారు. 'జగన్ ఐదేళ్లలో కాలేజీలు కట్టకపోయినా కట్టానని ప్రచారం చేసుకున్నారు. మేము పీపీపీ విధానం తెచ్చినా.. కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఓపీ ఫ్రీగా ఉంటుంది. రెండు, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఆపరేట్ అవుతాయి’ అని సీఎం తెలిపారు. భవిష్యత్తు కోసమే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తలపెట్టామన్నారు. 'నీళ్లు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాయ లసీమకు నీళ్లు ఇస్తే దేశంలోనే నంబర్​వన్​గా మారుతుంది. గోదావరిలో పైన ఉండే నీటిని తెలంగాణ వాడుకోవచ్చు. మేం సముద్రంలోకి వెళ్తన్న నీటినే వాడుకుంటాం. అందుకే బనకచర్ల కట్టాలని ప్రతిపాదించాం' అని చంద్రబా బు స్పష్టం చేశారు

Next Story