- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయ్యయ్యో.. ఎంతపని చేశార్రా..! అధికారులకు చివాట్లు పెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
అధికారుల అత్యుత్సాహం ఒక్కోసారి లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: అధికారుల అత్యుత్సాహం ఒక్కోసారి లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతోంది. తాజాగా ఏపీలోని పార్వతీపుర మన్యం జిల్లా సాలూరు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 3న నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తల్లి కాళికాంబ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు అత్తగారు కాళికాంబ పెద్దకర్మకు హాజరయ్యేందుకు ఆమె సాలూరుకు వెళ్లారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు ఆమె ఎందుకు వస్తున్నారోనని క్లారిటీ లేక ఆమె కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో పాచిపెంట మండలం పనుకువలసలో ప్రధాన మంత్రి జంజత్ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వస్తున్నారంటూ దండోరా కూడా వేయించారు.
అయితే, మంత్రి నిర్మలా సీతారామన్ తన అత్తగారి దశదిన కర్మకు హాజరయ్యేందుకు తన మరిది సుధాకర్ ఇంటికి వెళ్లేసరికి అక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు అధికార యంత్రాంగం బొకేలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు. అది చూసిన మంత్రి నిర్మలమ్మ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంత హడావుడి ఎందుకని, అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలపై ఫైర్ అయ్యారు. తాను వచ్చిన కార్యక్రమం ఏంటి.. మీరు ఏర్పాటు చేసిన పనేంటని అధికారులకు క్లాస్ పీకారు. అయితే, అసలు విషయం తెలుసుకున్న అధికారులు మంత్రి నిర్మలకు సారీ చెప్పారు.






