గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు

by Muthe.Rajitha |

గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (3rd World Telugu Conference) 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు.

గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (3rd World Telugu Conference) 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాసభలు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటే లక్ష్యంతో ఏర్పాటవుతున్నాయి. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో, హైవే సమీపంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు వేదికపై ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డితోపాటు మరో మూడు రాష్ట్రాల్ల గవర్నర్లు హాజరు కానున్నారు. 22 సాహితీ సదస్సులు, తెలుగు భాషా పరిరక్షణ, సాహిత్యాభివృద్ధి, సాంస్కృతిక వైభవంపై చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పురస్కారాల ప్రదానం ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. గతంలో 2017లో హైదరాబాద్‌లో, 2024లో రాజమహేంద్రవరంలో జరిగిన మహాసభల విజయవంతమైన నిర్వహణ తర్వాత ఈసారి గుంటూరు వేదికగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.

Next Story