ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనే లక్ష్యం : మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ (Education) అందుబాటులోకి తేవడే లక్ష్యంగా పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు.

ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనే లక్ష్యం : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ (Education) అందుబాటులోకి తేవడే లక్ష్యంగా పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య ఆహ్వానితులుగా లోకేష్ హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతూ 21వ శతాబ్దపు నైపుణ్యాలకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. సాంప్రదాయ విధానాలకు స్వస్తి చెబుతూ.. ఆట ఆధారిత పాఠ్యాంశాలు, ఏఐ ఆధారిత పరిష్కారాలతో బోధనా శిక్షణ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) వంటి వినూత్న కార్యక్రమాలను లీప్ ప్రోగ్రామ్ (LEAP)లో అమలు చేస్తున్నాం అన్నారు. ఏఐ, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా విద్యార్థులను టెక్నికల్, లీడర్ షిప్, రియల్ లైఫ్ నైపుణ్యాలతో (Real Life Skills) సన్నద్ధం చేయడానికి ఫలితాల ఆధారిత విధానం అమలుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) లక్ష్యాలకు అనుగుణంగా సవరించిన పాఠ్యాంశాలు, భవిష్యత్ నైపుణ్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా సమగ్ర అభ్యాసం కొత్త విధానంలో అంతర్భాగంగా ఉన్నాయని చెప్పారు. అన్ని స్థాయిల్లో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా పాఠ్యాంశాలు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Next Story