మస్కట్‌లో చిక్కుకున్న జిల్లా కార్మికులు.. రామ్మోహన్ నాయుడు కీలక హామీ

by Vemula.Srinu Prasad |

ఉపాధి కోసం వెళ్లి శ్రీకాకుళం జిల్లాకి చెందిన కార్మికులు మస్కట్ వెళ్లారు..

మస్కట్‌లో చిక్కుకున్న జిల్లా కార్మికులు.. రామ్మోహన్ నాయుడు కీలక హామీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉపాధి కోసం వెళ్లి శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)కి చెందిన కార్మికులు మస్కట్(Mascot) వెళ్లారు. అయితే కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశానికి రాలేక... అక్కడ పని దొరక్క అల్లాడిపోతుననారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) వెంటనే వారితో వీడియో కాల్ మాట్లాడారు. స్వదేశానికి రప్పిస్తామని, భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. భారత్ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల కుటుంబాలకు రామ్మోహన్ నాయుడు ధైర్యం చెప్పారు.

Next Story