NTR జిల్లాలో గోనెసంచిలో మృతదేహం

by Muthe.Rajitha |

NTR కృష్ణా జిల్లాలో గోనెసంచిలో మృతదేహం కలకలం రేపింది.

NTR జిల్లాలో గోనెసంచిలో మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్ : NTR కృష్ణా జిల్లాలో గోనెసంచిలో మృతదేహం కలకలం రేపింది. జిల్లాలోని వత్సవాయి మండలంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్న పోలీసుల వివరాల ప్రకారం.. NTR కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని మంగొల్లు- దేశవాయి గ్రామాల మధ్య ఆదివారం ఉదయం పంటకాలువలో రైతులకు ఓ గోనెసంచి కనబడింది. దానిని విప్పి చూడగా అందులో ఓ మృతదేహం కనబడగా.. భయబ్రాంతులకు గురైన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహం ఓ మహిళదిగా తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ మహిళ ఎవరు అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. మహిళను చంపి గోనెసంచిలో తెచ్చి పంట పొలాల మధ్య పడేయడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story