- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సార్.. మా కుమారులను రక్షించండి’.. పవన్ కళ్యాణ్‌కు మహిళ వినతి
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు(Deputy CM pawan kalyan) ఓ మహిళ వినతి పత్రం అందించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు(Deputy CM pawan kalyan) ఓ మహిళ వినతి పత్రం అందించారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ గండబోయిన సూర్యకుమారి అనే మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
విజయనగరానికి చెందిన ఆమె, మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. బుధవారం పవన్ కళ్యాణ్‌ను కలసిన ఆమె తమ ఇద్దరు కుమారులతో పాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్లు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తగిన హామీ ఇచ్చారు.






