- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఘోరం.. అంబులెన్స్ రాక చెట్టు కింద ప్రసవించిన మహిళ
ఏపీలోని అనకాపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. అంబులెన్స్ రాక మర్రిచెట్టు కింద ఓ గర్భిణి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయితీ లోసింగి గ్రామంలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని అనకాపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. అంబులెన్స్ రాక మర్రిచెట్టు కింద ఓ గర్భిణి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయితీ లోసింగి గ్రామంలో జరిగింది. గ్రామంలోని మహిళకు పురిటినొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాకపోవడంతో గ్రామస్తులు ఆ మహిళను డోలీలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు తీసుకునివెళ్లారు.
ఈ క్రమంలో మార్గ మధ్యలోనే ఓ చెట్టు కింద మహిళ ప్రసవించింది. ఆ తరవాత రెండు గంటల తవరాత అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. దీంతో తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని నాలుగు కిలోమీట్లర్లు నడిచి వచ్చినా అంబులెన్స్ తమ వద్దకు రాలేదని గర్భిణి కుటుంబ సభ్యులు చెప్పారు. ఏడు గంటలకు తాము ఫోన్ చేస్తే తొమ్మిది గంటలకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీసుకువెళ్లి రికార్డుల్లో మాత్రం అక్కడే డెలివరీ అయినట్టు రాసుకుంటారని ఆరోపించారు.






