- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GBS: జీబీఎస్ లక్షణాలతో మహిళ మృతి
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో జీబీఎస్(గులియన్బారే సిండ్రోమ్) లక్షణాలతో మరో మహిళ మృతి చెందింది

గుంటూరు జీజీహెచ్లో ఇది మూడో మరణం
వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్
దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో జీబీఎస్(గులియన్బారే సిండ్రోమ్)(Guillain-Barre syndrome) లక్షణాలతో మరో మహిళ మృతి చెందింది. నాలుగు రోజుల కిందట జీబీఎస్ లక్షణాలతో సీతామహాలక్ష్మి అనే మహిళ ఆస్పత్రిలో చేరింది. ఈ రోజు ఆమె మృతి చెందింది. అయితే వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) లో జీబీఎస్లక్షణాలతో గతంలో ఒకరు మృతి చెందారు. గత ఫిబ్రవరి నెలలో ఈ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి పలువురు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి పట్ల ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. కారణం ఇది అంటువ్యాధి కాదు. అయితే ఇది రావడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇతర వైరల్ఇన్ఫెక్షన్(viral infection) సోకి తగ్గిన వారిలో కూడా ఇది కనిపిస్తుందన్నారు. దీనికి చికిత్స ఖరీదుతో కూడుకున్నదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. వ్యాధిగ్రస్తులకు వాడే ఇంజక్షన్ ఖరీదైనదైనా వాటిని సరిపడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు. చేతులు, కాళ్లు అకస్మాత్తుగా వాపు రావడం ఈ వ్యాధి లక్షణం. నరాలు ఒక్కసారిగా చచ్చుబడిపోవడం, తీవ్రమోతాదులో పక్షవాతం కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనపడినా.. అంత ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నారు. అయితే కాళ్లు చేతులు అకస్మాత్తుగా చచ్చుబడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.






