విజయవాడలో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య

by Muthe.Rajitha |

విజయవాడలో నేడు దారుణ ఘటన చోటు చేసుకుంది.

విజయవాడలో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలో నేడు దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను నడిరోడ్డు మీదనే కత్తితో గొంతుకోసి చంపాడు ఆమె భర్త. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతికి ఆమె భర్తతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యాభర్తలు గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఆమెపై కోపం పెంచుకున్న భర్త, నేడు ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వద్ద నడిరోడ్డుపైనే ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story