జనసేన నేతపై ఆరోపణలు చేసిన మహిళ అరెస్ట్..!

by Ramesh Goud |

తిరుపతి(Thirupati) జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ (Janasena In Charge Kiran Royal) పై ఆరోపణలు చేసిన మహిళను జైపూర్ పోలీసులు (Jaipur police) అరెస్ట్ (Arrest) చేశారు.

జనసేన నేతపై ఆరోపణలు చేసిన మహిళ అరెస్ట్..!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Thirupati) జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ (Janasena In Charge Kiran Royal) పై ఆరోపణలు చేసిన మహిళను జైపూర్ పోలీసులు (Jaipur police) అరెస్ట్ (Arrest) చేశారు. కిరణ్ రాయల్ పట్ల చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ.. తిలక్ రోడ్డులోని తిరుపతి ప్రెస్ క్లబ్ (Thirupati Press Club)లో లక్ష్మీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం అనంతరం లక్ష్మీని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ ఓ ఫ్రాడ్ కేసులో జైపూర్ లో దోషిగా ఉన్నదని, అందుకే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. తర్వాత అన్నీ విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.

అరెస్ట్ అయిన లక్ష్మీ మాట్లాడుతూ.. ఇది కిరణ్ రాయల్ చేయించిన దౌర్జన్యాలలో ఒకటి అని, అతడి దౌర్జన్యాలకు అంతు లేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు బాధిత మహిళ లక్ష్మీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఆడపడుచులకు కష్టం వచ్చినా నిలబడతానని పవణ్ కళ్యాణ్ అంటారు.. కానీ రెండు రోజులగా ఒంటరిగా పోరాడుతున్నానని తెలిపారు. నిన్న పార్టీకి దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు నోటీసులు ఇచ్చారు.. కానీ నాకు ఏమీ సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, మహిళలకు అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు లను ఒక్కటే అడుగుతున్నానని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నానని అన్నారు.

ఈ నేపథ్యంలోనే లక్ష్మీని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కాగా గత కొద్దిరోజులుగా జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. కిరణ్ రాయల్ శారీరకంగా వాడుకొని తనను మోసం చేశాడని, కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేసి మోసగించాడని లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తోంది. అంతేగాక కిరణ్ రాయల్ తనని ఫోన్ లో బెదిరించిన ఆడియోలు విడుదల చేసి, ఆత్మహత్య చేసుకుంటానని ఆ మహిళ వీడియో సందేశం విడుదల చేసింది. అనంతరం బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకి వచ్చింది. దీనికి సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.

Next Story